11 రోజుల్లో 20 కోట్లతో “గీతాంజలి మళ్ళీ వచ్చింది”

11 రోజుల్లో 20 కోట్లతో “గీతాంజలి మళ్ళీ వచ్చింది”

Published on Apr 22, 2024 12:02 PM IST


అంజలి ప్రధాన పాత్రలో, శ్రీనివాస్ రెడ్డి, సునీల్, సత్యం రాజేష్, సత్య శకలక శంకర్, అలీ, బ్రహ్మాజీ, రవి శంకర్, రాహుల్ మాధవ్ కీలక పాత్రల్లో, డైరెక్టర్ శివ తుర్లపాటి దర్శకత్వం లో తెరకెక్కిన హార్రర్ కామెడీ ఎంటర్టైనర్ గీతాంజలి మళ్ళీ వచ్చింది. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరిస్తోంది. బాక్సాఫీస్ వద్ద డీసెంట్ వసూళ్లతో దూసుకు పోతుంది. ఈ చిత్రం 11 రోజుల్లో 20 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టడం జరిగింది. మేకర్స్ ఈ విషయాన్ని పోస్టర్ ద్వారా వెల్లడించారు.

ఈ చిత్రాన్ని ఎంవీవీ సినిమా మరియు కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ లపై ఎంవీవీ సత్య నారాయణ మరియు GV లు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించారు. లాంగ్ రన్ లో ఈ చిత్రం ఎలాంటి వసూళ్లను రాబడుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు