పవన్ త్రో బ్యాక్ పిక్ పంచుకున్న గీతా ఆర్ట్స్

Published on May 28, 2020 5:04 pm IST


గీతా ఆర్ట్స్ బ్యానర్ ట్విట్టర్ లో పవన్ త్రో బ్యాక్ పిక్ పంచుకున్నారు. 2003లో పవన్ హీరోగా వచ్చిన జానీ మూవీ చిత్రీకరణ సమయంలో ఆ ఫోటో తీయడం జరిగింది. దర్శకుడిగా పవన్ కళ్యాణ్ మొదటిసారి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీ స్టోరీ, స్క్రీన్ ప్లే కూడా పవన్ కళ్యాణ్ సమకూర్చడం విశేషం. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ నిర్మించిన ఈ మూవీ ఆశించిన విజయం సాధించలేదు. ఐతే సినిమా కాన్సెప్ట్ మరియు స్క్రీన్ ప్లే కి మంచి మార్కులు పడ్డాయి.

వరుస హిట్స్ తో సూపర్ ఫార్మ్ లో ఉన్న పవన్ కళ్యాణ్ ఈ మూవీ కోసం మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. అలాగే పవన్ బాగా బరువు తగ్గాడు. పాత్ర కోసం సన్నబడిన పవన్ లుక్ కి అప్పట్లో మిశ్రమ స్పందన దక్కింది. రేణు దేశాయ్ బద్రి సినిమా తరువాత మరో మారు పవన్ కళ్యాణ్ తో ఈ సినిమాలో నటించింది. ఈ మూవీ తరువాత ఆమె మళ్ళీ సినిమాలు చేయలేదు.

సంబంధిత సమాచారం :

More