‘పలాస 1978’ వెనుక పెద్ద నిర్మాతలు

‘పలాస 1978’ వెనుక పెద్ద నిర్మాతలు

Published on Dec 27, 2019 1:00 AM IST

Palasa

కంటెంట్ బాగుంటే చిన్న సినిమాల్ని తీసుకుని, విడుదల చేస్తున్నారు పెద్ద నిర్మాతలు. ఇప్పటికే సురేష్ బాబు, దిల్ రాజులు చాలా చిన్న సినిమాల్ని తమ ద్వారా విడుదల చేయగా ఇప్పుడు వారి జాబితాలోకి గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ లాంటి ఇంకో రెండు పెద్ద నిర్మాణ సంస్థలు చేరాయి.

ఈ రెండు నిర్మాణ సంస్థలు కలిసి కంటెంట్ నచ్చడంతో ‘పలాస 1978’ అనే సినిమాను విడుదల చేయడానికి ముందుకొచ్చాయి. ఇలా పెద్ద సంస్థల ద్వారా విడుదలకావడం సినిమాకి, బృందానికి బాగా కలిసొచ్చే విషయం. వచ్చే యేడాది జనవరిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ఈ రియలిస్టిక్ క్రైమ్ డ్రామాను కరుణ డైరెక్ట్ చేశారు. అక్టోబర్ నెలలో విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ మంచి స్పందన తెచ్చుకుంది. ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ సినిమాలో రక్షిత్, రఘు కుంచె, నక్షత్రలు ప్రధాన పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు