‘గీతాంజలి’ కి నేటి కలెక్షన్సే కీలకం

‘గీతాంజలి’ కి నేటి కలెక్షన్సే కీలకం

Published on Apr 15, 2024 11:24 AM IST

అంజలి ప్రధాన పాత్రలో, శ్రీనివాస్ రెడ్డి, సునీల్, సత్యం రాజేష్, సత్య కీలక పాత్రల్లో.. శివ తుర్లపాటి దర్శకత్వం లో తెరకెక్కిన హారర్ కామెడీ ఎంటర్టైనర్ గీతాంజలి మళ్ళీ వచ్చింది. గత శుక్రవారం ఈ సినిమా థియేటర్స్ లో విడుదలైంది. ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఈ సినిమా విఫలమైంది. ముఖ్యంగా కథలో ఫ్రెష్ నెస్ లేకపోవడంతో మొత్తానికి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మునిగిపోయింది. నిన్న ఆదివారం కూడా ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ ను రాబట్టలేకపోయింది. మరి ఈ చిత్రం భవిష్యత్తు నేటి నుంచి రాబోయే కలెక్షన్స్ తో తేలనుంది.

మరి సోమవారం నాడు కూడా గౌరవప్రదమైన కలెక్షన్స్ ను అందుకుంటే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సేఫ్ గా ఉన్నట్టే. ఒకవేళ, ఆ కలెక్షన్స్ కూడా దక్కకపోతే.. గీతాంజలి మళ్లీ వచ్చింది ప్లాప్ సినిమాగా నిలిచిపోతుంది. అన్నట్టు గీతాంజలి మళ్లీ వచ్చింది అంజలికి 50వ చిత్రం కావడం విశేషం. ఈ సినిమాలో షకలక శంకర్, సునీల్, అలీ, రవిశంకర్, రాహుల్ మాధవ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు