ఓటిటిలో సాలిడ్ రెస్పాన్స్ తో “గీతాంజలి మళ్ళీ వచ్చింది”

ఓటిటిలో సాలిడ్ రెస్పాన్స్ తో “గీతాంజలి మళ్ళీ వచ్చింది”

Published on May 19, 2024 4:02 PM IST

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ అంజలి ప్రధాన పాత్రలో శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్ అలాగే షకలక శంకర్ లు కలయికలో దర్శకుడు శివ తూర్లపాటి తెరకెక్కించిన లేటెస్ట్ హారర్ కామెడీ చిత్రం “గీతాంజలి మళ్ళీ వచ్చింది” కూడా ఒకటి. మరి థియేటర్స్ లో బాగానే రాణించిన ఈ చిత్రం రీసెంట్ గానే ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఆహా అలాగే మరో స్ట్రీమింగ్ యాప్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం ఇప్పుడు అందుబాటులో ఉంది.

ఇక ఆహా లో అయితే ఈ చిత్రం ఇప్పుడు అదరగొడుతుంది అని చెప్పాలి. లేటెస్ట్ గా ఈ చిత్రం 75 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ని క్రాస్ చేసి ఓటిటిలో దూసుకెళ్తుంది. మరి తొందరలోనే 100 మిలియన్ ని కూడా క్రాస్ చేయవచ్చని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో సునీల్, సత్య, ప్రముఖ నటుడు రవి శంకర్, ఆలీ తదితరులు నటించారు. అలాగే ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించిన ఈ చిత్రాన్ని కోన ఫిల్మ్ కార్పోరేషన్ అలాగే ఎంవివి సినిమాస్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు