ప్రమోషనల్ సాంగ్ చిత్రీకరణలో ‘గీతాంజలి’..

ప్రమోషనల్ సాంగ్ చిత్రీకరణలో ‘గీతాంజలి’..

Published on Jul 9, 2014 10:30 PM IST

geetanjali
కోన వెంకట్ సమర్పణలో యంవివి సత్యనారాయణ నిర్మిస్తున్న ‘గీతాంజలి’ సినిమా అనేక హంగులతో రూపొందుతుంది. వి వినాయక్ వాయిస్ ఓవర్, బ్రహ్మానందంపై ఒక స్పెషల్ సాంగ్, ప్రముఖ హీరోయిన్ పై మరొక స్పెషల్ సాంగ్ ఎలా ఎన్నో ప్రత్యేకతలతో ముస్తాబవుతుంది. తాజాగా ఈ సినిమా ప్రమోషనల్ సాంగ్ చిత్రీకరిస్తున్నారు. రాజ్ కిరణ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

అంజలి ప్రధాన పాత్రలో నటిస్తున్న హారర్ కామెడీ థ్రిల్లర్ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకోవడంతో పబ్లిసిటీపై దృష్టి పెట్టారు దర్శకనిర్మాతలు. అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రమోషనల్ సాంగ్ షూట్ చేస్తున్నారు. అంజలి, బ్రహ్మానందం, రావురమేష్, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు షూటింగ్లో పాల్గొన్నారు.

ఇటివల కాలంలో సినిమా విజయం వెనుక కథ, కథనం, నటీనటుల పెర్ఫార్మన్స్, దర్శకత్వం తదితర అంశాలతో పాటు ప్రమోషన్ ఎంత బాగా చేశారు అనే అంశం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. సినిమా బాగున్నా దానికి సరైన రీతిలో ప్రమోషన్ చేయకపోతే విజయం రావడం లేదు. విజయంతో వసూళ్లు(కలెక్షన్స్) కూడా తగ్గుముఖం పడుతున్నాయి. టాలీవుడ్ దర్శకనిర్మాతలు బాలీవుడ్ ను ఫాలో అవుతూ ప్రమోషన్ కార్యక్రమాలపై ప్రత్యెక శ్రద వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు