స్మశానంలో టీజర్ లాంచ్.. “గీతాంజలి” టీం క్రేజీ ప్లాన్

స్మశానంలో టీజర్ లాంచ్.. “గీతాంజలి” టీం క్రేజీ ప్లాన్

Published on Feb 22, 2024 9:59 AM IST

ప్రముఖ హీరోయిన్ అంజలి మెయిన్ లీడ్ లో శ్రీనివాస్ రెడ్డి అలాగే షకలక శంకర్ సత్యం రాజేష్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన కామెడీ హారర్ థ్రిల్లర్ “గీతాంజలి” కోసం టాలీవుడ్ ఆడియెన్స్ కి తెలిసిందే. అప్పట్లో కామెడీ హారర్ డ్రామాలకి మంచి రెస్పాన్స్ ఉన్న క్రమంలో వచ్చిన ఈ సినిమా కూడా మంచి హిట్ అయ్యింది. మరి దర్శకుడు రాజ్ కిరణ్ తెరకెక్కించిన ఈ చిత్రానికి మేకర్స్ సీక్వెల్ “గీతాంజలి మళ్ళీ వచ్చింది” ని మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత అనౌన్స్ చేశారు.

మరి షూటింగ్ కూడా మంచి స్పీడ్ లో కంప్లీట్ చేస్తుండగా వీరు ఇప్పుడు వినూత్నంగా ఆలోచించారు. ఈ సినిమా టీజర్ లాంచ్ ని ఏకంగా స్మశానంలో ప్లాన్ చేశారు. ఈ ఫిబ్రవరి 24 శనివారం రాత్రి 7 గంటల సమయంలో బేగంపేట్ స్మశానవాటికలో అయితే సినిమా టీజర్ ని లాంచ్ చెయ్యడానికి ముహూర్తం ఫిక్స్ చేసారు. దీనితో ఈ క్రేజీ ప్లాన్ మాత్రం ఇప్పుడు టాలీవుడ్ లో వైరల్ గా మారింది. ఇక ఈ చిత్రానికి ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తుండగా ఎంవీవీ సినిమాస్ మరియు కోనా వెంకట్ లు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు