‘తిప్ప‌రామీసం’.. శాటిలైట్ రైట్స్ కొనేశారు !

Published on Oct 24, 2019 2:48 pm IST

శ్రీవిష్ణు హీరోగా నిక్కీ తంబోలి హీరోయిన్ గా రాబోతున్న చిత్రం `తిప్ప‌రామీసం`. కాగా తాజాగా ఈ చిత్రం శాటిలైట్ హక్కుల్ని జెమినీ టీవీ సొంతం చేసుకుంది. ఈ మేరకు జెమినీ సంస్థ అధికారికంగా పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఇక ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కోసం జెమినీ మంచి ఎమౌంటే వెచ్చించిందని ఫిల్మ్ నగర్ టాక్. రిజ్వాన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, కృష్ణ విజ‌య్ ఎల్ ప్రొడ‌క్ష‌న్‌, శ్రీ ఓం సినిమా ప‌తాకాల‌ పై కృష్ణ విజ‌య్‌.ఎల్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రూపొందుతుంది.

ఇక ఇటివలే ఈ సినిమా నుండి ‘మౌనం హృదయం రాగమే’ అనే సాంగ్ విడుద‌లైన సంగతి తెలిసిందే. హీరోహీరోయిన్లు తమ మనసుల్లోని ప్రేమ తాలూకు అంతరంగ భావాలను వ్యక్తపరుచుకునే సందర్భంలో వచ్చే ఈ పాట బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా సురేశ్ బొబ్బిలి సంగీతం అలాగే పూర్ణ చారి సున్నితమైన సాహిత్యం, మరియు రంజని అద్భుతమైన గాత్రం ఈ పాటను మరో స్థాయిలో నిలబెట్టాయి.

కాగా ఈ సినిమాకి సురేశ్ బొబ్బిలి సంగీతం అందించారు. యాక్ష‌న్ రివేంజ్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రానికి సిద్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. అలాగే ధ‌ర్మేంద్ర కాక‌రాల‌ ఎడిట‌ర్‌ గా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More