
2012లో రితేష్ దేశ్ ముఖ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత జెనీలియా వెండితెరకు దూరమైంది. మధ్యలో రెండు సినిమాలలో అతిధి పాత్రలలో సందడి చేసింది. ఓ కుమారుడికి జన్మనివ్వడంతో పాటు తన సమయాన్ని పూర్తిగా కుటుంబానికే కేటాయించింది. మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదించిన జెనీలియా మనసు తిరిగి సినిమాల వైపు మళ్ళింది. వెండితెరపై రీ ఎంట్రీకి రెడీ అంటుంది.
‘నేను సినిమాలను వదిలి దూరంగా వెళ్ళలేదు. కాస్త విరామం తీసుకున్నాను అంతే. త్వరలో తిరిగి సినిమాల్లో ఎంట్రీ ఇవ్వడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. నాకు, ప్రేక్షకులకు సంతోషాన్ని కలిగించే పనులు చేయాలనుకుంటున్నాను. రెడీ ఫర్ రీ ఎంట్రీ.’ అని జెనీలియా తెలిపింది. ఇటివల ఓ ప్రమోషనల్ ఈవెంట్ కి హాజరయిన జెనీలియాను మీడియా ప్రతినిధులు రీ ఎంట్రీ గురించి ప్రశ్నించగా పైవిధంగా స్పందించింది.