“జార్జ్ రెడ్డి” హీరో నుంచి సరికొత్త సినిమా.!

Published on Nov 26, 2020 8:05 pm IST

మన టాలీవుడ్ లో ఉన్నటువంటి యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో ప్రముఖ నటుడు సందీప్ మాధవ్ కూడా ఒకరు. వంగవీటి సినిమాతో మంచి హైప్ నే తెచ్చుకున్నాడు కానీ అది ఆ సినిమాకు మాత్రమే పరిమితం అయ్యింది కానీ అతని కెరీర్ కు బూస్ట్ ఇవ్వలేకపోయింది. కానీ గత ఏడాది చేసిన “జార్జ్ రెడ్డి” సినిమాతో మాత్రం తనలోని నటుణ్ని అలాగే తనని కూడా తెలుగు ఆడియెన్స్ గుర్తించేలా చేసింది.

అయితే ఆ చిత్రం అనుకున్న స్థాయి విజయాన్ని అందుకోనప్పటికీ అతనికి మాత్రం మంచి గుర్తింపుని ఇచ్చింది. అయితే ఇప్పుడు ఈ టాలెంటెడ్ హీరో తన నెక్స్ట్ సినిమాను టేకప్ చేసాడు. నూతన దర్శకుడు జేవీ మధు కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి హాల్కియాన్ ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్నారు.

అలాగే ఈ దర్శకుడు ఇది వరకే టాలీవుడ్ స్టార్ దర్శకుడు అయినటువంటి బాబీ దగ్గర రచయితగా పని చేసి ఈ చిత్రంతో తన డెబ్యూ ఫిల్మ్ ను స్టార్ట్ చేశారు. ఇక అలాగే ఈ చిత్రంలో ఒక స్టార్ నటుడు కూడా కీలక పాత్రలో కనిపించనున్నారట. అలాగే ఈ చిత్రానికి సంబంధించి మరింత సమాచారాన్ని మేకర్స్ ముందు రోజుల్లో వెల్లడించనున్నారు.

సంబంధిత సమాచారం :

More