గెట్ రెడీ..”RRR” నుంచి బ్యూటిఫుల్ అప్డేట్.!

rrr

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ మల్టీస్టార్టింగ్ అండ్ పవర్ ఫుల్ పాన్ ఇండియన్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. సమయం గడుస్తున్నా కొద్దీ ఈ సినిమాపై అంచనాలు పతాక స్థాయికి చేరుతున్నాయి.

అయితే ఈ చిత్రంలో కొమరం భీం గా తారక్ అల్లూరిగా చరణ్ లు నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే వీరిలో చరణ్ కు గాను బాలీవుడ్ స్టార్ నటి ఆలియా భట్ నటిస్తుండగా తారక్ సరసన ఆంగ్ల నటి ఒలీవియా మోరిస్ నటిస్తుంది. మరి ఇదిలా ఉండగా ఈరోజు ఆమె పుట్టినరోజు కావడంతో మేకర్స్ విషెష్ చెప్పడంతో పాటుగా ఒక స్పెషల్ అప్డేట్ ను కూడా విడుదల చేస్తున్నట్టు తెలిపారు.

తమ బ్యూటిఫుల్ అండ్ రావెషింగ్ జెన్నిఫర్ పై అప్డేట్ ను ఈ 11 గంటలకు విడుదల చేస్తున్నట్టుగా టైం లాక్ చేశారు. అయితే అది ఆమెకు సంబంధించిన సినిమాలో లుక్ పోస్టర్ అని అనిపిస్తుంది. మరి మేకర్స్ ఏం అప్డేట్ ఇవ్వబోతున్నారో తెలియాలి అంటే అప్పటి వరకు ఆగాల్సిందే.

Exit mobile version