ఆసక్తిని పెంచేసిన ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ న్యూ ట్రైలర్

ఆసక్తిని పెంచేసిన ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ న్యూ ట్రైలర్

Published on Sep 9, 2015 8:09 PM IST

Courier-Boy-Kalyan-First-Lo
‘చిన్నదానా నీకోసం’ లాంటి రొమాంటిక్ ఎంటర్టైనర్ తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న యంగ్ హీరో నితిన్ ఈ సారి రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఆ సినిమానే ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’. పనీ పాటా లేకుండా ఖాళీగా తిరిగే సాధారణ యువకుడి లైఫ్ లో ఒక అసాధారణ సంఘటన జరిగితే అతని లైఫ్ ఎలా మారిపోయింది, తను మళ్ళీ మామూలు జీవితాన్ని సాగించడానికి ఏమేమి చేయాల్సి వచ్చింది అనేదే ఈ కొరియర్ బాయ్ కళ్యాణ్ కథ. గౌతమ్ మీనన్ నిర్మాతగా చేసిన ఈ సినిమా లేటెస్ట్ ట్రైలర్ నిన్న రిలీజ్ అయ్యింది.

ఈ లేటెస్ట్ ట్రైలర్ అందరిలోనూ ఆసక్తిని పెంచేయడమే కాకుండా అందరినీ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా గౌతమ్ మీనన్ తన వాయిస్ ఓవర్ లో చెప్పిన ఈ సినిమా థీమ్ లైన్ అందరికీ బాగా నచ్చింది. ముఖ్యంగా చివర్లో ‘ఒక మామూలు మనిషిని అసాధారణమైన మనిషిగా మార్చడానికి ఒక్క సంఘటన చాలు’ అని చెప్పిన లైన్ బాగా కనెక్ట్ అయ్యింది. గౌతమ్ మీనన్ అసిస్టెంట్ ప్రేమ్ సాయి దర్శకుడిగా పరిచయం అవుతూ చేసిన ఈ సినిమాలో యామి గౌతమ్ హీరోయిన్. సింగర్ కార్తీక్ మ్యూజిక్ అందించిన సినిమా ఈ రోజు సెన్సార్ కి వెళ్ళింది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు