‘సాహో’ ఛాయిస్ ఎవరు ?

Published on May 28, 2019 2:01 pm IST

భారీ బడ్జెట్ చిత్రం ‘సాహో’ నుండి తప్పుకుంటున్నట్టు బాలీవుడ్ సంగీత దర్శకుల త్రయం శంకర్, ఎహసాన్, లోయ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎలాంటి వివాదాలు లేకుండా వీరు ప్రాజెక్ట్ నుండి బయటకు వెళ్లిపోయారు. నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ సైతం చాలా నెమ్మదిగా వాళ్ళు ఈ సినిమాకు పనిచేయట్లేదని చెబుతూ భవిష్యత్తులో వారితో వర్క్ చేయాలనుకుంటున్నామని అన్నారు. దీంతో కొత్త సంగీత దర్శకుడు ఎవరనే విషయంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

కొందరేమో షేడ్స్ ఆఫ్ సాహో వీడియోలకు స్కోర్ అందించిన తమన్ మిగతా పాటలకి మ్యూజిక్ ఇస్తారని అంటుగా ఇంకొందరేమో ఘిబ్రన్ ఈ సినిమాకు పనిచేస్తారని అంటున్నారు. ఘిబ్రన్ గతంలో సుజీత్ డైరెక్ట్ చేసిన ‘రన్ రాజా రన్’కు సంగీతం ఇచ్చారు. ఆ పరిచయంతోనే చిత్ర దర్శకుడు సుజీత్ ఘిబ్రన్ వైపు ముగ్గు చూపుతున్నారట. తమిళ మీడియా సైతం ఘిబ్రన్ ‘సాహో’కు పనిచేసే ఆస్కారముందని చెబుతున్నాయి. మరి తమన్, ఘిబ్రన్ ఇద్దరిలో ఎవరు ఫైనల్ అవుతారో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :

More