20 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ కి రెడీ అయిన విజయ్ కల్ట్ బ్లాక్ బస్టర్ “గిల్లి”

20 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ కి రెడీ అయిన విజయ్ కల్ట్ బ్లాక్ బస్టర్ “గిల్లి”

Published on Apr 3, 2024 6:01 PM IST

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) ప్రధాన పాత్రలో, డైరెక్టర్ ధరణి దర్శకత్వం లో తెరకెక్కిన రొమాంటిక్ స్పోర్ట్స్ యాక్షన్ ఎంటర్టైనర్ గిల్లి. తెలుగు లో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన ఒక్కడు చిత్రానికి ఇది రీమేక్. 2004 లో రిలీజై ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంది. విజయ్ కెరీర్ లో కల్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఈ చిత్రం మరోసారి ప్రేక్షకుల ముందుకి వచ్చేందుకు రెడీ అయిపోయింది.

ఏప్రిల్ 20, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో గిల్లి మూవీ రీ రిలీజ్ కానుంది. త్రిష హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం లో ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో నటించారు. శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రానికి విద్యాసాగర్ సంగీతం అందించారు. ఈ చిత్రం రీ రిలీజ్ కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు