‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ నుండి గిరి గిరి లిరిక‌ల్ సాంగ్

‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ నుండి గిరి గిరి లిరిక‌ల్ సాంగ్

Published on May 29, 2024 7:00 PM IST

యంగ్ హీరో విశ్వ‌క్ సేన్ న‌టిస్తున్న తాజా చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి’ మే 31న రిలీజ్ కు సిద్ధ‌మైంది. ప‌క్కా మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందిన ఈ సినిమాలో హీరో విశ్వక్ సేన్ పాత్ర ప్రేక్ష‌కుల‌ను ఖచ్చితంగా ఆక‌ట్టుకుంటుంద‌ని చిత్ర యూనిట్ ధీమా వ్య‌క్తం చేస్తోంది. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌టంతో ప్ర‌మోష‌న్స్ తో దూసుకుపోతుంది. ఇప్ప‌టికే ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ కు నంద‌మూరి బాల‌కృష్ణ ముఖ్య అతిథిగా రావ‌డంతో ఈ సినిమాపై మంచి బ‌జ్ క్రియేట్ అయ్యింది.

ఇక ఈ సినిమా నుండి తాజాగా ‘గిరి గిరి’ అనే లిరికల్ సాంగ్ ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. ప‌క్కా మాస్ ఫీస్ట్ లా సాగే ఈ పాటకు కాస‌ర్ల శ్యామ్ లిరిక్స్ అందించారు. సింగ‌ర్ రామ్ మిర్యాల మ‌రోసారి త‌న‌దైన మార్క్ సింగింగ్ తో ఈ పాట‌ను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లారు. మ్యూజిక్ డైరెక్ట‌ర్ యువ‌న్ శంక‌ర్ రాజా అందించిన మాస్ బీట్స్ కు విశ్వ‌క్ సేన్ ఊర‌మాస్ స్టెప్పులు తోడ‌య్యాయి.

ఈ సినిమాలో అంజ‌లి, నేహా శెట్టి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. సాయి కుమార్, హైప‌ర్ ఆది, ప్ర‌వీణ్ ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్ పై సూర్య‌దేవ‌ర నాగ వంశీ, సాయి సౌజ‌న్య‌లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు