‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా తర్వాత మన టాలీవుడ్ చాక్లెట్ బాయ్ రామ్ పోతినేనికి మాస్ లో మంచి స్టార్డం వచ్చింది. అందుకే అక్కడ నుంచి మంచి మాస్ మసాలా లైనప్ ను సెట్ చేస్తూ రామ్ వెళ్తున్నాడు. అలా తన లైనప్ లో ప్రముఖ దర్శకుడు ఎన్ లింగుసామితో ఓ సాలిడ్ బై లాంగువల్ ప్రాజెక్ట్ ను ఓకే చేసారు.
దీనితో ఈ కాంబో పై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాపై ఎప్పటికపుడు కొత్త అప్డేట్స్ ఇస్తూ వస్తున్న మేకర్స్ ఇప్పుడు మరో అధికారిక అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రంలో మరో హీరోయిన్ గా గ్లామరస్ బ్యూటీ అక్షర గౌడ ని తీసుకున్నట్టుగా కన్ఫర్మ్ చేసారు.
ఇపుడు అధికారికంగానే ఈ విషయాన్ని మేకర్స్ ప్రకటించడంతో ఈ సినిమాపై మరింత హైప్ వచ్చింది. ఇక ఈ చిత్రంలో కృతి శెట్టి కూడా మరో హీరోయిన్ గా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే అలాగే శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ వారు నిర్మాణం వహిస్తున్నారు.
Welcoming Talented Actress @iAksharaGowda Onboard for #RAPO19
Ustaad @ramsayz @dirlingusamy @IamKrithiShetty @ThisIsDSP @SS_Screens @sujithvasudev @srinivasaaoffl @NavinNooli @anbariv pic.twitter.com/FjfeUX9WtT
— Srinivasaa Silver Screen (@SS_Screens) July 31, 2021
