Pic Talk : లాంగ్ హెయిర్, సింపుల్ లుక్, కిరాక్ స్టైల్.. ‘పెద్ది’ రిలీజ్‌కు ముందు ముంబై వీధుల్లో రామ్ చరణ్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడ అడుగుపెట్టినా అది ఫ్యాన్స్‌కు పండగే. ఇప్పుడు దేశవ్యాప్తంగా మెగా అభిమానులు ‘పెద్ది’ ఫీవర్‌లో ఉన్నారు. జూన్ 4న ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కానున్న నేపథ్యంలో చరణ్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. ఇందులో భాగంగానే తాజాగా ఈ మెగా హీరో ముంబై వీధుల్లో తళుక్కున మెరిశారు. ఎప్పటిలాగే తనదైన సింపుల్ అండ్ స్టైలిష్ అవతార్‌తో కెమెరాలకు చిక్కారు.

ముంబైలో పాపరాజీల కంటికి చిక్కిన ఆయన లేటెస్ట్ లుక్ నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. డార్క్ బ్లూ కలర్ టీషర్ట్, లైట్ బ్లూ రిప్డ్ జీన్స్ ధరించి చాలా క్యాజువల్‌గా కనిపించారు. కళ్లకు నల్లటి కూలింగ్ గ్లాసెస్, కాళ్లకు స్నీకర్స్‌తో ఆయన స్టైల్ అదిరిపోయింది. ముఖ్యంగా ‘పెద్ది’ సినిమా కోసం ఆయన లాంగ్ హెయిర్, గుబురు గడ్డంతో మెయింటైన్ చేస్తున్న రగ్గడ్ లుక్.. ఆయనలోని మాస్ అప్పీల్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లింది.

తనను ఫొటోలు తీస్తున్న ఫోటోగ్రాఫర్లకు, అభిమానులకు ఎంతో కూల్‌గా థంబ్స్ అప్ చూపిస్తూ చరణ్ పోజులిచ్చారు. ఎలాంటి హంగామా లేకుండా, ఎంతో సాదాసీదాగా కనిపించినా ఆయనలోని గ్లోబల్ స్టార్ డమ్ ఏమాత్రం తగ్గలేదని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇప్పటికే ‘పెద్ది’ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రిలీజ్‌కు సమయం దగ్గరపడుతుండటంతో, ఇలా ముంబై వీధుల్లో చరణ్ స్టైలిష్‌గా దర్శనమివ్వడం సినిమా ప్రమోషన్స్‌కు మరింత మైలేజ్ ఇస్తోంది. మెగా ఫ్యాన్స్ అయితే ఈ ఫొటోలను సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేస్తూ రిలీజ్ కౌంట్‌డౌన్ స్టార్ట్ చేసేశారు.

Exit mobile version