యంగ్ హీరో మంచు మనోజ్ హీరోగా నటించిన ‘కరెంట్ తీగ’ ఆడియో లాంచ్ నిన్న సాయంత్రం ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖుల సమక్షంలో చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ జి. నాగేశ్వర్ రెడ్డి మంచు మనోజ్ ని తెగపొగిడేసాడు. ‘కచ్చితంగా ఒకరోజు మంచు మనోజ్ తన తండ్రి మోహన్ బాబు కన్నా బెటర్ నటుడని నిరూపించుకుంటాడని’ అన్నాడు. ఈ మాటలు అక్కడ ఉన్న వారినే కాకుండా మోహన్ బాబు, మనోజ్ షాక్ అయ్యారు. వెంటనే అక్కడే ఉన్న మోహన్ బాబు మైక్ తీసుకొని నన్ను పరిచయం చేసిన దాసరి గారు దీనికి ఎప్పటికీ ఒప్పుకోరని అన్నాడు.
అంతే కాకుండా మంచు మనోజ్ ఇండస్ట్రీకి వచ్చి 10 సంవత్సరాలు పూర్తయ్యింది. ఈ సందర్భంగా చాలా మంది ప్రముఖులు మనోజ్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే మోహన్ బాబు, దాసరిలు మనోజ్ ని రిస్కీ స్టంట్స్ చేయడం తగ్గించమని సలహా ఇచ్చారు. మంచు విష్ణు నిర్మించిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. సన్నీ లియోన్, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.


