మెగాస్టార్ చిరంజీవి హీరోగా సూపర్ గుడ్ ఫిలిమ్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంస్థలపై ఎంతో భారీ వ్యయంతో నిర్మితం అయిన లేటెస్ట్ హిట్ మూవీ గాడ్ ఫాదర్. ఎస్ థమన్ సంగీతం అందించిన ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి, బ్రహ్మ అనే పవర్ఫుల్ రోల్ చేయగా ఇతర కీలక పాత్రల్లో నయనతార, సత్యదేవ్, సల్మాన్ ఖాన్, సముద్రఖని తదితరులు కనిపించారు.
ఇక గాడ్ ఫాదర్ లో సాంగ్స్ కూడా ఆడియన్స్ ని ఫ్యాన్స్ ని ఎంతో ఆకట్టుకోగా ముఖ్యంగా టైటిల్ సాంగ్ అయితే లిరిక్స్, ట్యూన్ పరంగా ఆడియన్స్ ని మరింత ఆకర్షించింది. ఇక ఈ టైటిల్ సాంగ్ ఫుల్ వీడియోని కొద్దిసేపటి క్రితం మేకర్స్ యూట్యూబ్ లో రిలీజ్ చేసారు. ప్రస్తుతం ఈ సాంగ్ కి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. యాక్షన్ తో కూడిన ఎమోషనల్ పొలిటికల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీని డైరెక్టర్ మోహన్ రాజా అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునేలా తెరకెక్కించగా హీరో మెగాస్టార్ చిరంజీవి మరొక్కసారి తన సూపర్ పెర్ఫార్మన్స్ తో ఆడియన్స్, ఫ్యాన్స్ మనసు దోచారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి


