ప్రెస్ నోట్స్ : హైద‌రాబాద్‌, బెంగ‌ళూరుల్లో.. `యునైటెడ్ తెలుగు కిచెన్స్‌` ప్రారంభం

ప్రెస్ నోట్స్ : హైద‌రాబాద్‌, బెంగ‌ళూరుల్లో.. `యునైటెడ్ తెలుగు కిచెన్స్‌` ప్రారంభం

Published on Apr 12, 2024 5:15 PM IST

తెలుగు వారి ప‌సందైన రుచుల‌కు పెట్టింది పేరు గోదావ‌రి జిల్లాలు. వెజ్ ఐటంల నుంచి నాన్‌వెజ్ డిషెస్ వ‌ర‌కు.. గోదావ‌రి రుచులు ప్ర‌పంచ వ్యాప్తంగా ఘుమ‌ఘుమ‌లాడుతూనే ఉన్నాయి. దీంతో తెలుగు వారు ఎక్క‌డ ఉన్నా.. గోదావ‌రి వంట‌కాల‌ను రుచి చూడాల్సిందే!!. ఇలా.. తెలుగు వంట‌కాల రుచుల‌ను అంద‌రికీ చేరువ చేస్తోంది గోదావ‌రీస్‌.. యునైటెడ్ తెలుగు కిచెన్స్‌ (UTK).

ఈ క్ర‌మంలో తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్‌, క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరులోనూ గ‌త వారం యునైటెడ్ తెలుగు కిచెన్స్‌ (UTK) మ‌రికొన్ని శాఖ‌ల‌ను ప్రారంభించింది. హైద‌రాబాద్‌లోని కోకాపేట‌లో, బెంగ‌ళూరులోని వైట్ ఫీల్డ్‌లో ఈ యునైటెడ్ తెలుగు కిచెన్స్‌ (UTK) ఆహార ప్రియుల జిహ్వాచాప‌ల్యాన్ని తీర్చ‌నున్నాయి.

2022, మార్చిలో విజ‌య‌వాడ‌లో ప్రారంభ‌మైన యునైటెడ్ తెలుగు కిచెన్స్‌ (UTK) తెలుగువారి రుచుల‌ను ప‌దిలంగా అందించ‌డ‌మే ల‌క్ష్యంతో అన‌తికాలంలో శాఖోప‌శాఖ‌లుగా విస్త‌రించింది.

తెలంగాణ‌, క‌ర్ణాట‌క‌లోనూ UTK ల‌ను ప్రారంభించారు. హైద‌రాబాద్‌లోని చందాన‌గ‌ర్‌లో గ‌తంలోనే తొలి బ్రాంచ్‌ను ప్రారంభించ‌గా.. తాజాగా కోకాపేట‌లో ఏర్పాటు చేశారు (Best South Indain Restaurant in Kokapet). అదేవిధంగా బెంగ‌ళూరులోనూ ఇప్ప‌టికే రెండు ఉన్నాయి. క‌న‌క‌పుర‌లో తొలి శాఖ‌ను ఏర్పాటు చేయ‌గా.. త‌ర్వాత క‌డుగోడిలో రెండో శాఖ‌ను ఏర్పాటు చేశారు (Best South Indian Restaurant in Kadugodi). ఇప్పుడు వైట్ ఫీల్డ్స్‌లోనూ UTK ఏర్పాటైంది.

ఈ సంద‌ర్భంగా `గోదావ‌రి` వ్య‌వ‌స్థాప‌కులు కౌశిక్ కోగంటి, తేజ చేకూరి మాట్లాడుతూ.. “తెలుగు వారి వంట‌కాల‌ను ప్ర‌పంచంలోనే అత్యున్నత స్థాయికి తీసుకువెళ్లాల‌నే అతిపెద్ద‌ ల‌క్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. తెలుగు వారి వంట‌కాలు, రుచుల‌కు అలాంటి సామ‌ర్థ్యం ఉంద‌ని మేం బ‌లంగా న‌మ్ముతున్నాం“ అని తెలిపారు.

హైద‌రాబాద్‌లో ఇటీవ‌ల ప్రారంభించిన UTK కోకాపేట (Interior Photo Gallery).. జాయింట్ వెంచ‌ర్‌. UTK సహ వ్యవస్థాపకుడు తేజీ పిన్నమనేని, జస్వంత్ రెడ్డి సంయుక్తంగా దీనిని ఏర్పాటు చేశారు. జ‌స్వంత్‌రెడ్డి `ఇష్ట‌` స‌హ వ్య‌వ‌స్థాప‌కులు కూడా. గోదావ‌రి సంస్థ నుంచి ఏర్పాటైన పూర్తి శాఖాహార కాన్సెప్టే.. ఇష్ట‌!! అన‌తి కాలంలో విస్త‌రిస్తున్న కోకాపేట‌లో UTK ను అందుబాటులోకి తీసుకురావాల‌న్న ల‌క్ష్యంతో దీనిని ఏర్పాటు చేశారు.

వ్యాపార అవ‌కాశాలు, క్యాట‌రింగ్ కోసం..

UTK Kokapet

Raichandani Business Bay,

Kokapet, Hyderabad.

 

UTK Kadugodi

Opp: AWHO Sandeep Vihar,

Vastu Bhoomi,

Kannamangala, Bengaluru.

భోజన ప్రియుల కోసం మా ‘యునైటెడ్ తెలుగు కిచెన్స్‌ (UTK)’లో ‘కష్ట’పడి చేసే నలభీమపాకం వంటి వంటకాలను మీరంతా ‘ఇష్ట’పడి ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాం…

మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు!

Contact: +91 9848009091

Visit: https://UnitedTeluguKitchens.com/

Content Produced by: Indian Clicks, LLC

సంబంధిత సమాచారం

తాజా వార్తలు