
ప్రముఖ సంచలన దర్శకులు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రాకింగ్ స్టార్ మంచు మనోజ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నేడు ప్రారంభమయింది. ‘ఒక నటుడిగా వర్మ సెట్స్ లో అడుగు పెట్టడం అదృష్టంగా భావిస్తున్నాను. చాలా ఎగ్జయిటింగ్ గా ఉంది. ఈరోజు నాతోనే ఫస్ట్ డే షూటింగ్ మొదలవుతుంది. మీ ఆశీర్వాదాలు కావాలి’ అని మనోజ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
ఈ సినిమాలో జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. మనోజ్ గత చిత్రం ‘కరెంట్ తీగ’లో జగపతి హీరోయిన్ తండ్రిగా నటించారు. వర్మ సినిమాలో హీరోయిన్ ఎవరనేది త్వరలో తెలుస్తుంది. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకేక్కుతుందని సమాచారం. ఈ సినిమాకు ‘గొలుసు’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది.
వర్మ దర్శకత్వం వహించిన ‘రౌడీ’, ‘అనుక్షణం’ సినిమాలలో మోహన్ బాబు, విష్ణుల నటనకు మంచి పేరొచ్చింది. నటుడిగా మనోజ్ ను వర్మ ఎలాంటి పాత్రలో ప్రజెంట్ చేస్తారో.. వెయిట్ & సి.
Excited and blessed to enter @RGVzoomin sets as an actor 🙂 first day of our shoot wid me 🙂 Bless our team Swt hrts