అజిత్ కి బర్త్ డే విషెస్ తెలిపిన “గుడ్ బ్యాడ్ అగ్లీ” ప్రొడ్యూసర్స్!

అజిత్ కి బర్త్ డే విషెస్ తెలిపిన “గుడ్ బ్యాడ్ అగ్లీ” ప్రొడ్యూసర్స్!

Published on May 1, 2024 8:06 PM IST

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ చివరిసారిగా తునివు చిత్రం లో కనిపించారు. ఈ చిత్రం ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంది. ప్రస్తుతం మగిజ్ తిరుమేని దర్శకత్వంలో విడా ముయార్చి చిత్రం లో నటిస్తున్నారు. ఈ చిత్రంతో పాటుగా అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం లో గుడ్ బ్యాడ్ అగ్లీ అనే చిత్రం ను చేస్తున్నారు. ఈ రోజు అజిత్ యొక్క 53వ పుట్టినరోజు. అజిత్ పుట్టిన రోజు సందర్భంగా గుడ్ బ్యాడ్ అగ్లీ ప్రొడ్యూసర్స్ బర్త్ డే విషెస్ తెలిపారు.

గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై వై. రవి శంకర్, నవీన్ యెర్నేని లు సంయుక్తం గా నిర్మిస్తున్నారు. నేడు అజిత్ ను ప్రత్యేకం గా కలిసి బర్త్ డే విషెస్ తెలిపారు ప్రొడ్యూసర్స్. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు