‘సఖి’ ట్రైలర్ తో ‘కీర్తి సురేష్’ ఆకట్టుకుందా ?

Published on Jan 24, 2022 12:00 am IST

‘కీర్తి సురేష్’ మెయిన్ లీడ్ గా నటించిన సినిమా ‘గుడ్ లక్ సఖి’. అయితే, ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. రేపు ఉదయం 10.11 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. మరి ‘సఖి’ ట్రైలర్ తో ‘కీర్తి సురేష్’ ఆకట్టుకుందా ? చూడాలి. సుధీర్ చంద్ర పాదిరీ నిర్మించిన ఈ సినిమాకు దేవి శ్రీప్రసాద్ మ్యూజిక్ అందించాడు. ఈ ట్రైలర్ లోనే సినిమా రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ ప్రకటించే అవకాశముంది.

ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. ‘U’ సర్టిఫైతో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సన్నద్ధం అవుతుంది. ఆది పినిశెట్టి, జగపతిబాబు ప్రధాన పాత్రల్లో నటించారు. నగేష్ కుకునూర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్ పై సుధీర్ చంద్ర పడిరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

ఇక ఈ చిత్రానికి శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. చిరంతన్ దాస్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ చిత్రం గతంలోనే విడుదల కావాలి. కానీ, కొన్ని కారణాల కారణంగా పోస్ట్ ఫోన్ అవుతూ వచ్చింది.

సంబంధిత సమాచారం :