ఓపెనింగ్స్‌లో ‘అల్లరి ఈజ్ బ్యాక్’..!

ఓపెనింగ్స్‌లో ‘అల్లరి ఈజ్ బ్యాక్’..!

Published on Jul 24, 2015 5:20 PM IST

james-bond
అల్లరి నరేష్ సినిమాలంటే కామెడీకి ఓ సరికొత్త బ్రాండ్. కామెడీని తనదైన స్టైల్లో ప్రెజెంట్ చేస్తూ మెప్పిస్తూ వచ్చిన నరేష్ గత కొద్దికొలంగా తనదైన సినిమా చేయలేకపోయారు. తాజాగా ఆయన హీరోగా నటించిన మరో కామెడీ సినిమా ‘జేమ్స్‌ బాండ్’ ఆ లోటును తీర్చే సినిమాగా ప్రచారం పొందుతూ వచ్చింది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా ద్వారా సాయి కిషోర్ దర్శకుడిగా పరిచయం పరిచయమయ్యారు.

గత రెండు వారాలుగా బాహుబలి సినిమా తప్ప మరో సినిమా విడుదల కాని నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా అల్లరి నరేష్ మార్క్ ఎంటర్‌టైనర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అన్నిచోట్లా ఈ కామెడీకి మంచి స్పందనే లభించింది. ఇక ఈ మధ్య కాలంలో అల్లరి నరేష్ సినిమాలకు ఎప్పుడూ రానంతగా ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. సుడిగాడు తర్వాత అల్లరి నరేష్ సినిమాల్లో అత్యధిక ఓఫెనింగ్స్ తెచ్చుకునే సినిమాగా జేమ్స్ బాండ్ నిలవనుందని ట్రేడ్ టాక్. జేమ్స్ బాండ్.. ‘నేను కాదు నా పెళ్ళాం’ అన్న ట్యాగ్‌లైన్‌తో వచ్చిన సినిమాలో సాక్షి చౌదరి అల్లరి నరేష్‌‍ను ఇబ్బందుల్లో పడేసే భార్యగా నటించింది.

తాజా వార్తలు