
నందమూరి యంగ్ హీరో కళ్యాణ్ రామ్ నటించిన మాస్ మసాలా ఎంటర్టైనర్ ‘పటాస్’. ఈ సినిమా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. ప్రీ రిలీజ్ నుంచే ఈ సినిమాకి పాజిటివ్ టాక్ ఉండడం మరియు ఆంధ్ర, తెలంగాణలో బెనిఫిట్ షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో నందమూరి అభిమానులు, సినీ అభిమానులు ఈ సినిమా కోసం థియేటర్స్ దగ్గర బారులు తీసారు. అంతే కాకుండా మొదటి రోజు కళ్యాణ్ రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
అంతే కాకుండా లాంగ్ వీకెండ్ కావడంతో మొదటి వారం కూడా రికార్డ్ స్థాయి కలెక్షన్స్ నమోదవుతాయని డిస్ట్రిబ్యూటర్స్ అంటున్నారు. చాలా రోజుల నుంచి సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న కళ్యాణ్ రామ్ ఈ సినిమా పాజిటివ్ టాక్ తో చాలా హ్యాపీగా ఉన్నాడు. ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన అనిల్ రావిపూడి కూడా మంచి పేరు వచ్చింది. శృతి సోది హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని కళ్యాణ్ రామ్ సొంత బ్యానర్ లో నిర్మించాడు.

