హ్యాట్రిక్ హిట్స్‌తో జోరుమీదున్న యువహీరో నిఖిల్, ప్రముఖ రచయిత కోన వెంకట్ నిర్మాణంలో ‘శంకరాభరణం’ అనే సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. తన గత మూడు సినిమాలనూ సరికొత్త కథాంశాలతో ఉండేలా చూసుకున్న ఈ యువహీరో, ‘శంకరాభరణం’ ద్వారా ఓ స్టైలిష్ క్రైమ్ కామెడీని అందించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకుంటున్న ఈ సినిమాపై బిజినెస్ వర్గాల్లో మంచి క్రేజ్ కనబడుతోంది. నిఖిల్ ట్రాక్ రికార్డ్, కోన వెంకట్ రచయితగా పనిచేయడమే కాక, స్వయంగా నిర్మించడం వంటివి ఈ సినిమాపై అంచనాలు పెంచేశాయి.
ఇక శంకరాభరణం సినిమా ఓవర్సీస్ హక్కులను స్కై హై ఫిల్మ్స్ పెద్ద మొత్తానికి కొనుగోలు చేసింది. నిఖిల్ గత సినిమాల యూఎస్ కలెక్షన్స్ కంటే ఈ సినిమా మరింత కలెక్ట్ చేస్తుందనే టాక్ ఉన్న నేపథ్యంలో ఓవర్సీస్ హక్కులు పెద్ద మొత్తానికి అమ్ముడాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమాకు మంచి బిజినెస్ ఆఫర్స్ వస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ఈ సినిమాపై ఓ ప్రత్యేక ఆసక్తిని కలిగించడంలో విజయం సాధించాయి. దీంతో అన్నిచోట్లా ప్రీ బిజినెస్ బాగుంది. శంకరాభరణం సినిమా చేస్తోన్న ప్రీ బిజినెస్ పట్ల నిఖిల్ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. అందరూ తమపై ఉంచిన నమ్మకాన్ని నిజం చేసేలా సినిమా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉదయ్ నందనవనమ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో నందిత హీరోయిన్‌గా నటిస్తున్నారు.
