ఏందిరా పాటకు మంచి స్పందన !

శ్రీ విష్ణు తాజాగా నటిస్తోన్న సినిమా ‘నీది నాది ఒకే కథ’. వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో సాట్నా టైటస్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈరోజు ఉదయం విడుదల చేసిన ఈ మూవీ ప్రమోషనల్ సాంగ్ ఏందిరా ఈ జనాల గోల పాటకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. యూత్ కు ఈ సాంగ్ బాగా కనెక్ట్ అయ్యే విధంగా ఉంది.

సురేష్ బొబ్బిలి అందించిన సంగీతం ఈ సినిమాకు మెయిన్ ప్లస్ కానుందని పాటలు వింటుంటే తెలుస్తోంది. చదువు పై ఆసక్తి లేని వాడిని చదువుకోమని చెప్పేకంటే, వాడికి ఎందులో ఆసక్తి ఉందో తెలుసుకుని ఆ దిశగా వాడి పయనం సాగించినట్ల‌యితే అతను విజయం సాధిస్తాడనే పాయింట్ తో దర్శకుడు వేణు ఉడుగుల ఈ సినిమాను తెరకెక్కించడం జరిగింది. డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో విడుదల కానున్న ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందుతుందని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది. రాజ్ తోట సినిమాటోగ్రఫి అందించిన ఈ సినిమాకు నాగేశ్వర రెడ్డి బొంతల ఎడిటర్ గా పనిచేసారు.

Exit mobile version