‘గోపాల గోపాల’ భజే భాజే సాంగ్ కి మంచి రెస్పాన్స్

‘గోపాల గోపాల’ భజే భాజే సాంగ్ కి మంచి రెస్పాన్స్

Published on Jan 2, 2015 8:28 AM IST

gopala-gopala
ప్రస్తుతం సెట్స్ పై ఉన్న టాలీవుడ్ మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ ‘గోపాల గోపాల’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – విక్టరీ వెంకటేష్ కలిసి నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ చిత్ర టీం ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. 2105 న్యూ ఇయర్ కానుకగా రిలీజ్ చేసిన ఫోటోలకు మరియు స్పెషల్ పోస్టర్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. అంతే కాకుండా ఈ సినిమాలో అనూప్ రూబెన్స్ కంపిజ్ చేసిన భజే భాజే ఆడియో సాంగ్ ని కూడా రిలీజ్ చేసారు. మెలోడియస్ గా సాగే ఈ పాటకి అందరిని నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా దాదాపు ఫినిష్ కావచ్చింది. ఇప్పటికే ఈ సినిమా నైజాం రైట్స్ ని నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్ అయిన దిల్ రాజు సొంతం చేసుకున్నాడు. గోపాల గోపాల చిత్ర ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కూడా యు ట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. కిషోర్ పార్ధసాని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని డి. సురేష్ బాబు – శరత్ మరార్ కలిసి నిర్మిస్తున్నారు. వెంకటేష్ కి జోడీగా శ్రియ శరన్ నటిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ దేవుడిగా కనిపిస్తాడు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు