“మంగళవారం” మూవీకి బుల్లితెర పై సూపర్ రెస్పాన్స్!

“మంగళవారం” మూవీకి బుల్లితెర పై సూపర్ రెస్పాన్స్!

Published on Feb 22, 2024 6:06 PM IST

పాయల్ రాజ్ పుత్ లీడ్ రోల్ లో, నందిత శ్వేత, అజయ్ ఘోష్, దివ్యా పిళ్ళై కీలక పాత్రల్లో, టాలెంటెడ్ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వం లో తెరకెక్కిన సైకలాజికల్ థ్రిల్లర్ మంగళవారం. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇటీవల వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రముఖ టీవీ ఛానల్ అయిన స్టార్ మా లో ప్రసారం అయ్యింది. ఈ ప్రీమియర్ కి ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ చిత్రం 7.21 టీఆర్పీ రేటింగ్ ను రాబట్టడం జరిగింది. ఈ చిత్రానికి ఈ రేటింగ్ సూపర్ అని చెప్పాలి. ఏ క్రియేటివ్ వర్క్స్ మరియు ముద్ర మీడియా వర్క్స్ బ్యానర్ లపై స్వాతి మరియు సురేష్ వర్మ లు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి బి. అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు