సోల్డ్ ఔట్ అవుతున్న “ఊరు పేరు భైరవకోన” స్పెషల్ షోస్!

సోల్డ్ ఔట్ అవుతున్న “ఊరు పేరు భైరవకోన” స్పెషల్ షోస్!

Published on Feb 13, 2024 12:36 PM IST


టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ VI ఆనంద్ దర్శకత్వం లో తెరకెక్కిన సూపర్ నాచురల్ ఫాంటసీ థ్రిల్లర్ ఊరు పేరు భైరవకోన. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 16 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. సినిమా రిజల్ట్ పై ఉన్న కాన్ఫిడెంట్ తో స్పెషల్ షో లని ఫిబ్రవరి 14 న పలు ప్రాంతాల్లో వేయనున్నారు. ఈ షో లకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది.

బుకింగ్ ఓపెన్ చేసిన అన్ని ప్రాంతాల్లో ఫాస్ట్ గా ఫిల్ అవుతున్నాయి. చాలా ప్రాంతాల్లో సోల్డ్ ఔట్ అయ్యాయి. ఇది సినిమా రిజల్ట్ పై గట్టిగా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇంకా పలు చోట్ల షో లను యాడ్ చేస్తున్నారు. సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే, మంచి వసూళ్లు రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. వర్షా బోల్లమ్మ, కావ్య థాపర్ లు లేడీ లీడ్ రోల్స్ లో నటించిన ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించారు. ఈ చిత్రం కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు