“ఊరు పేరు భైరవకోన” పెయిడ్ ప్రీమియర్స్ కి సూపర్ రెస్పాన్స్!

“ఊరు పేరు భైరవకోన” పెయిడ్ ప్రీమియర్స్ కి సూపర్ రెస్పాన్స్!

Published on Feb 11, 2024 5:38 PM IST

టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ vi ఆనంద్ దర్శకత్వం లో తెరకెక్కిన సూపర్ నాచురల్ ఫాంటసీ థ్రిల్లర్ ఊరు పేరు భైరవకోన. ఈ ఫిబ్రవరి 16 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కానుంది ఈ సినిమా. సినిమా మీద ఉన్న కాన్ఫిడెంట్ తో మేకర్స్ పలు ప్రాంతాల్లో పెయిడ్ ప్రీమియర్ షో లను ఫిబ్రవరి 14 వ తేదీన ప్లాన్ చేశారు. వీటికి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. అన్ని చోట్ల ఫాస్ట్ ఫిల్లింగ్ తో దూసుకు పోతుంది ఈ సినిమా. ఈ సినిమా నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

చిత్ర యూనిట్ సినిమాకి సంబందించిన ప్రమోషన్స్ ను కూడా వేగవంతం చేయడం జరిగింది. వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్, వెన్నెల కిషోర్, హర్ష చెముడు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించారు. AK ఎంటర్ టైన్మెంట్స్ మరియు హాస్య మూవీస్ బ్యానర్ లపై నిర్మించిన ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు