‘వినయ విధేయ రామ’ టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్!

‘వినయ విధేయ రామ’ టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్!

Published on Nov 9, 2018 4:41 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘వినయ విధేయ రామ’ చిత్రం యొక్క టీజర్ ఈరోజు విడుదలైన విషయం తెలిసిందే. ఇక ఈ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటివరకు ఈ చిత్ర టీజర్ 40లక్షల ఫై చిలుకు డిజిటల్ వ్యూస్ ను రాబట్టింది. పక్కా మాస్ ఎలిమెంట్స్ తో వచ్చిన ఈ టీజర్ చరణ్ అభిమానులను ఆకట్టుకుంటుంది.

ప్రస్తుతం చివరి షెడ్యూల్ షూటింగ్ ను జరుపుకుంటున్న ఈ చిత్రంలో సీనియర్ నటీనటులు స్నేహ , ప్రశాంత్ , ఆర్యన్ రాజేష్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ‘భరత్ అనే నేను’ ఫేమ్ కియరా అద్వానీ కథానాయికగా నటిస్తుంది. దానయ్య డీవీవీ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు