నిన్న దర్శకుడు అనిల్ రావిపూడి కి రెండు పండుగలు ఒకే రోజు వచ్చాయి. ఒకటి తనకు అబ్బాయి పుట్టడం కాగా మరోటి మెగాస్టార్ అతిథిగా వస్తున్న సరిలేరు నీకెవ్వరు మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ రోజే అది జరగడం. అలాగే ఈ మూవీ నిర్మాణ భాగస్వామిగా ఉన్న దిల్ రాజు కు కూడా నిన్నటి రోజే మనవరాలు పుట్టారట. నూతన సంవత్సరం ప్రారంభంలో దర్శక నిర్మాతల ఇంట్లోకి కొత్త అతిథులు రావడంతో పాటు సినిమాకు వస్తున్న రెస్పాన్స్.. అన్ని కలగలుపుకొని ఈచిత్రం ఖచ్చితంగా విజయం సాధిస్తుందని నమ్ముతున్నారు. విడుదలకు ముందు జరుగుతున్న శుభపరిణామాలే ఇందుకు సూచకం అని భావిస్తున్నారు. నిన్న విడుదలైన ట్రైలర్ కూడా ట్రెమండస్ రెస్పాన్స్ అందుకున్న నేపథ్యంలో సరిలేరు నీకెవ్వరు సూపర్ హిట్ కావడం ఖాయం అని గట్టిగా నమ్ముతున్నారు.
మహేష్ కి జంటగా రష్మిక మందాన నటిస్తున్న ఈ చిత్రాన్ని నిర్మాత రామ బ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 11న గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది. సరిలేరు నీకెవ్వరు చిత్రంలో విజయ శాంతి భారతి అనే కాలేజీ ప్రొఫెసర్ రోల్ చేశారు. సరిలేరు నీకెవ్వరు చిత్రానికి దేవిశ్రీ సంగీతం అందించారు.


