బేబీ సమంత 2019 సెకండ్ హాఫ్, ఘనంగా ప్రారంభించింది

బేబీ సమంత 2019 సెకండ్ హాఫ్, ఘనంగా ప్రారంభించింది

Published on Jul 6, 2019 9:59 AM IST

2019 మొదటి ఆరునెలలు టాలీవుడ్ కి మిశ్రమ ఫలితాలను అందించింది. కొందరు బ్లాక్ బస్టర్ విజయాలు అందుకోగా మరికొందరు పరాజయాలు చవిచూశారు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన “ఎఫ్2” ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై పెద్ద సినిమాలైన “వినయ విధేయ రామ”,ఎన్టీఆర్ కథానాయకుడు” సినిమాలను మించిన వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఫిబ్రవరిలో ప్రజాదరణ కలిగిన ఇద్దరు నేతలైన వైస్సార్,ఎన్టీఆర్ బయోపిక్ లు విడుదలయ్యాయి. వీటిలో వైస్సార్ బయోపిక్ “యాత్ర” డీసెంట్ వసూళ్లు సాధించి పర్వాలేదనిపించగా,ఎన్టీఆర్ బయోపిక్ “మహానాయకుడు” ఆశించినంత విజయం సాధించలేదు.
ఇక ఈ ఏడాది వేసవి కానుకగా ఏప్రిల్ లో విడుదలైన మజిలీ, చిత్రలహరి, జెర్సీ మూడు చిత్రాలు ప్రేక్షకులను అలరించి మంచి విజయాలను నమోదు చేశాయి. మే నెలలో మహేష్ “మహర్షి” తో వసూళ్ల ప్రభంజనం సృష్టించారు. ఇక ఈ మధ్య విడుదలైన గేమ్ ఓవర్, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ,కల్కి చిత్రాలు కూడా విజయవంతమైన చిత్రాలుగా పేరు తెచ్చుకున్నాయి.

ఇక ఈ ఏడాది సెకండ్ హాఫ్ ప్రారంభంలో సమంత “ఓ బేబీ”, ఆది సాయి కుమార్ నటించిన “బుర్రకథ” విడుదలైనాయి. బుర్రకథ మూవీకి మిశ్రమ స్పందన రాగా,సమంత ఓ బేబీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన “ఓ బేబీ” మూవీ హాస్యం కూడిన ఎమోషనల్ డ్రామా కి సర్వత్రా ప్రశంసలు అందుతున్నాయి. నటి సమంతకు,అలాగే దర్శకురాలు నందినిరెడ్డికి కెరీర్ లోనే బెస్ట్ మూవీగా నిలిచిపోవడం ఖాయం అంటున్నారు. ఏమైనా సమంత ఓ బేబీ మూవీతో 2019 రెండవ భాగాన్ని ఘనంగా ప్రారంభించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు