కృష్ణ జిల్లాలో ‘గూఢచారి’, ‘చి ల సౌ’ వీకెండ్ కలెక్షన్స్

Published on Aug 6, 2018 11:35 am IST

అడివి శేష్ , శోభిత దూళిపాళ్ల హీరోహీరోయిన్లుగా నూతన దర్శకుడు శశి కిరణ్ టిక్క దర్శకత్వంలో తెరకెక్కిన్న చిత్రం ‘గూఢచారి’. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో సుశాంత్, రుహాణి శర్మ హీరో హీరోయిన్లు గా తెరకెక్కిన చిత్రం ‘చి ల సౌ’. ఈ చిత్రాలు శుక్రవారం విడుదలై రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మరియు ఓవర్సీస్ లో కూడా బాక్స్-ఆఫీసు వద్ద విజయవంతమైన చిత్రాలుగా దూసుకెళ్తున్నాయి. కాగా ఈ రెండు సినిమాలు కృష్ణ జిల్లలో భారీగా వసూళ్లు చేస్తూ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో విజయవంతంగా ప్రదర్శించబడుతున్నాయి

కాగా మూడవ రోజు అయిన ఆదివారం నాడు కృష్ణ జిల్లాలో గూఢచారి 13,27,058 రూపాయల విలువైన షేర్ ను కలెక్ట్ చేయగా ఈ చిత్రం మొదటి వారాంతపు షేర్ విలువ 29.59 లక్షలకు చేరుకుంది. మరో వైపు, ‘చి ల సౌ’ ఆదివారం నాడు రూ .4,66,107 షేర్ ను రాబట్టగా, 3-రోజుల కృష్ణా జిల్లా షేర్ వచ్చేసరికి 9.93 లక్షల రూపాయలుగా ఉంది.

సంబంధిత సమాచారం :

X
More