పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – విక్టరీ వెంకటేష్ కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ ‘గోపాల గోపాల’. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాని సంక్రాంతి కానుకగా ప్రేక్షకులకు అందివ్వడానికి ఈ చిత్ర టీం సన్నాహాలు చేస్తోంది. అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ సినిమా ఆడియో రిలీజ్ ఉంటుందని కొంతమంది మరియు కొంతమంది ఏమో ఉండదు అని అంటున్నారు. ఈ చిత్ర టీం ఇప్పుడు అధికారికంగా ఆడియో రిలీజ్ డేట్ ని ఖరారు చేసింది. ఈ చిత్ర టీం న్యూ ఇయర్ కానుకగా జనవరి 1న రిలీజ్ చేయనున్నారు. ఎక్కువభాగం శిల్పకళా వేదికలో ఈ ఆడియో రిలీజ్ కార్యక్రమం జరుగుతుంది.
అలాగే అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్న ‘గోపాల గోపాల’ మ్యూజిక్ ఆల్బంలో కేవలం మూడు పాటలు మాత్రమే ఉంటాయి. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. వెంకటేష్ సరసన శ్రియ జోడీ కట్టింది. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘ఓ మై గాడ్’ కి రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాకి కిషోర్ పార్ధసాని డైరెక్టర్. సురేష్ బాబు – శరత్ మరార్ కలిసి నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ – వెంకటేష్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.


