పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, విక్టరీ వెంకటేష్ లు కలిసి నటించిన ‘గోపాల గోపాల’ థియేట్రికల్ ట్రైలర్ సోషల్ మీడియాలో సంచలనంరేపుతుంది. గత ఆదివారం ఈ సినిమా ఆడియో లాంచ్ సందర్భంగా విడుదలైన ఈ ట్రైలర్ వెనువెంటనే యు ట్యూబ్ లో ట్రెండ్ అవ్వడం మొదలుపెట్టింది
ఇప్పుడు ఈ ట్రైలర్ అజిత్ ‘ఎన్నై అరిందినాల్’ ట్రైలర్ ని పక్కకు నెట్టి వ్యూస్ కౌంట్ లో టాప్ పొజిషన్ కూర్చుంది. దీన్ని చూసిన వారి సంఖ్య ఇప్పటికే 5లక్షల మందిని దాటగా తెలుగులో అత్యధిక హిట్లు వచ్చిన ట్రైలర్ గా నిలిచింది
‘గోపాల గోపాల’ సినిమా త్వరలో బ్రహ్మాండమైన విడుదలకు సిద్ధమవుతుంది. సురేష్ బాబు, శరత్ మరార్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ అందించిన స్వరాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకు కిషోర్ పార్ధసాని(డాలీ) దర్శకుడు


