దర్శకుడిగా మారనున్న రచయిత గోపి మోహన్

Gopi-mohan
‘రెడీ’, ‘దూకుడు’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు రచయిత గా పనిచేసిన గోపి మోహన్ దర్శకుడిగా మారనున్నాడు. ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మించగా, సునీల్ హీరోగా నటించనున్నట్టు సమాచారం. అయితే దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ విషయాన్నీ గోపి మోహన్ తన ట్విట్టర్ ఎకౌంటు ద్వారా తెలిపాడు. ఈ సందర్బంగా అయన నిర్మాత అనిల్ సుంకరను పొగడ్తలతో ముంచెత్తాడు.

Exit mobile version