నాగార్జున – వంశి పైడిపల్లి చిత్రానికి గోపి సుందర్ మ్యూజిక్.

నాగార్జున – వంశి పైడిపల్లి చిత్రానికి గోపి సుందర్ మ్యూజిక్.

Published on Feb 11, 2015 11:47 AM IST

Gopi-Sundar
కింగ్ నాగార్జున, తమిళ హీరో కార్తి కలిసి నటించబోయే మల్టీస్టారర్ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించనున్నారు. ఇటివల విడుదలైన ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ చిత్రంతో తెలుగులో గోపి సుందర్ సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు. అతని సంగీతానికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. అంతకు ముందు మలయాళంలో పలు చిత్రాలకు గోపి సుందర్ సంగీతం అందించారు. ఆయా చిత్ర విజయాలలో సంగీతం కీలక పాత్ర పోషించింది.

‘బృందావనం’, ‘ఎవడు’ వంటి విజయవంతమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన వంశి పైడిపల్లి ఈ భారి మల్టీస్టారర్ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. పివిపి సినిమాస్ పతాకంపై చిత్రం తెరకెక్కనుంది. ప్రసాద్ వి పోట్లురి నిర్మాత. శృతి హాసన్ కథానాయిక. రెగ్యులర్ షూటింగ్ మార్చి నెలలలో ప్రారంభమవుతుంది.

తాజా వార్తలు