హీరో గోపీచంద్ ప్రస్తుతం సూపర్ హిట్ కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నో ఆశలతో చేసిన ‘చాణక్య’ కూడా నిరాశపరిచింది. కాగా తనకు నటుడిగా లైఫ్ ఇచ్చి ఇండస్ట్రీలో తనను నిలబెట్టినా దర్శకుడు తేజతో సినిమా చేయడానికి గోపీచంద్ కొన్ని రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే.
కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం డైరెక్టర్ తేజ గోపీచంద్ తో కలిసి పని చేయడానికి ఇంట్రస్ట్ గా ఉన్నాడట. ఇప్పటికే వీరిద్దరి మధ్య కథ పై చర్చలు జరిగాయట. గోపీచంద్ కి డైరెక్టర్ తేజ మాస్ జోనర్ లో ఓ లైన్ ను చెప్పారని.. పూర్తిగా పాత్ర బలంతో నడిచే ఆ కథ గోపీచంద్ కి కూడా బాగా నచ్చిందని తెలుస్తోంది. అన్నీ కుదిరితే ఏప్రిల్ నుండి వీరి సినిమా పట్టాలైక్కే అవకాశముంది.
కాగా డైరెక్టర్ తేజ దర్శకత్వంలో వచ్చిన ‘జయం, నిజం’ సినిమాలతో ప్రతినాయకుడిగా నిలదొక్కుకున్న గోపీచంద్ ఈ సారి హీరోగా తేజ దర్శకత్వంలో సూపర్ హిట్ అందుకుంటాడేమో చూడాలి.


