“భీమా” ఓటిటి రిలీజ్ విషయంలో దర్శకుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!

“భీమా” ఓటిటి రిలీజ్ విషయంలో దర్శకుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!

Published on Feb 25, 2024 12:59 AM IST


మ్యాచో హీరో గోపీచంద్ హీరోగా దర్శకుడు ఏ హర్ష తెరకెక్కించిన లేటెస్ట్ సాలిడ్ యాక్షన్ డ్రామా “భీమా” కోసం అందరికీ తెలిసిందే. మరి మంచి మాస్ ఎలిమెంట్స్ తో ప్లాన్ చేసిన ఈ చిత్రం ట్రైలర్ కి ఇప్పుడు మాస్ ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండగా ఈ ట్రైలర్ లాంచ్ సమయంలో చిత్ర దర్శకుడు ఓటిటి రిలీజ్ విషయంలో చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ గా మారాయి.

తాను మాట్లాడుతూ ఈ చిత్రం ఓటిటి రిలీజ్ కోసం ఎవరూ ఎదురు చూడవద్దని ముందు సినిమాని థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చెయ్యాలని ఖచ్చితంగా భీమా చిత్రం ఒక ఫీస్ట్ ని ఇస్తుంది అని తెలిపాడు. దీనితో భీమా ఓటిటి రిలీజ్ కోసం ఎదురు చూసేవారు అయితే ఈ మాస్ చిత్రాన్ని మొదట థియేటర్స్ లోనే విట్నెస్ చేయాలని చెప్పాలి.

అలాగే తన కామెంట్స్ తో ఈ చిత్రాన్ని తాము అంత తొందరగా ఓటిటి రిలీజ్ కి తీసుకొచ్చే ఆలోచనలో కూడా లేనట్టు అనిపిస్తుంది. ఇక ఈ చిత్రానికి రవి బసృర్ సంగీతం అందించగా శ్రీ సత్య సాయి ఆర్ట్స్ వారు నిర్మాణం వహించారు. అలాగే ఈ చిత్రం థియేటర్స్ లో ఈ మహా శివరాత్రి కానుకగా ఈ మార్చ్ 8 న రిలీజ్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు