ఎగ్రెసివ్ హీరో గోపీచంద్ హీరోగా మెహ్రీన్, జరీన్ ఖాన్ హీరోయిన్స్ గా ఏకే ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై తమిళంలో సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు తిరు దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన భారీ చిత్రం ‘చాణక్య’. ఎంటర్టైనింగ్ గా సాగే స్పైయాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా నాన్ – థియేట్రికల్ రైట్స్ కి భారీ మొత్తం వచ్చినట్లు తెలుస్తోంది. తెలుగు శాటిలైట్ హక్కులకు 4 కోట్లు వస్తే.. అలాగే డిజిటల్ రైట్స్ కు అమెజాన్ 2 కోట్లు ఇచ్చిందట. అదేవిధంగా హిందీ డబ్బింగ్ రైట్స్ కి ఏకంగా రూ.9 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం మీద నాన్ – థియేట్రికల్ రైట్స్ కింద చాణక్యకు 15 కోట్లు వరకూ గిట్టుబాటు అయిందట.
కాగా ఈ చిత్రంలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ హైలెట్ గా నిలుస్తాయట. ఇండో – పాక్ బోర్డర్ లో వచ్చే సన్నివేశాలు.. మరియు కొన్ని యాక్షన్ సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటాయని.. ఈ చిత్రం అవుట్ ఫుట్ పై గోపీచంద్ చాల నమ్మకంగా ఉన్నాడు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి వెట్రి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమాతోనైనా గోపీచంద్ హిట్ అందుకుంటాడేమో చూడాలి.
