రామోజీ ఫిల్మ్ సిటీలో గోపీచంద్ యాక్షన్

Gopichand
మాస్ చిత్రాల కధానాయకుడు గోపీచంద్, రాశి ఖన్నా జంటగా యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. రాధాకృష్ణ కుమార్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రంలో గోపీచంద్ ఇప్పటివరకు కనిపించనంత స్టైలిష్ గా కనపడనున్నారు.

ప్రస్తుతం యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ ఫైట్ ను దాబా బ్యాక్ డ్రాప్ లో చిత్రీకరిస్తున్నారు. గోపీచంద్, రాశి ఖన్నా తరితర తారాగణం షూటింగ్లో పాల్గొంటున్నారు. భాద్యత గల యువకుడిగా, స్టైలిష్ ప్రేమికుడిగా తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించనున్నారు గోపీచంద్.

Exit mobile version