సంపత్ నందితో గోపీచంద్ చిత్రం ఖాయమయినట్లే !

సంపత్ నందితో గోపీచంద్ చిత్రం ఖాయమయినట్లే !

Published on Jul 6, 2018 1:00 PM IST

gopichand sampathnandi

పంతం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన గోపీచంద్ పర్వాలేదనిపించుకున్నాడు. ప్రస్తుతం కుమార్ అనే కొత్త దర్శకుడితో గోపీచంద్ ఓ చిత్రం చేయబోతున్న విషయం తెలిసిందే. అది ప్రధానంగా ప్రేమతో కూడుకున్న యాక్షన్ సబ్జెక్ట్ అట. ఆ చిత్రాన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్ గారు నిర్మించనున్నారు.

ఐతే కుమార్ చిత్రం తర్వాత గోపీచంద్ సంపత్ నంది దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే సంపత్ నంది చెప్పిన కథ గోపిచంద్ కి బాగా నచ్చింది. కాకపొతే తన పాత్రకి సంబంధించి చిన్న చిన్న మార్పులు చెప్పారట. ఇక ఈ సినిమా పట్టాలెక్కడం దాదాపు ఖాయంగానే కనిపిస్తుంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రస్తుతం థియేటర్స్ లో పంతం మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు