చాణక్య పై నమ్మకంగా ఉన్న గోపీచంద్ !

చాణక్య పై నమ్మకంగా ఉన్న గోపీచంద్ !

Published on Sep 15, 2019 12:36 AM IST

యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా తమిళ దర్శకుడు తిరు దర్శకత్వంలో వస్తోన్న యాక్ష‌న్ స్పై థ్రిల్ల‌ర్ చాణ‌క్య‌. అయితే ఇటీవలే ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసింది చిత్రబృందం. నెటిజన్లను బాగా ఆకట్టుకున్న ఈ టీజర్ మొత్తానికి సినిమా పై అంచనాలను పెంచింది. టీజర్ చూస్తుంటే ఈ చిత్రంలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ హైలెట్ గా నిలుస్తాయని అనిపిస్తోంది. అలాగే ఇండో – పాక్ బోర్డర్ లో వచ్చే సన్నివేశాలు.. మరియు కొన్ని యాక్షన్ సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటాయనేలా కనిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాను దసరా పండుగ సందర్భంగా విడుదల చేస్తున్నారు. కాగా ఈ చిత్రం అవుట్ ఫుట్ పై గోపీచంద్ చాల నమ్మకంగా ఉన్నాడట.. సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వబోతుందని చిత్రబృందం కూడా చెప్పుకొస్తోంది.

కాగా ఈ సినిమాలో గోపీచంద్ సరసన మెహరీన్ హీరోయిన్‌ గా నటిస్తుంది. వీరిద్దరూ జంటగా నటిస్తోన్న రెండో చిత్రమిది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి వెట్రి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమాలో గోపీచంద్ గడ్డంతో ఉన్న మ్యాచో లుక్‌ లో కనిపించనున్నారు. కాగా గోపీచంద్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న ఈ స్పై థ్రిల్లర్ ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. మరి గోపీచంద్ ఈ సినిమాతో హిట్ అందుకుంటాడేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు