‘పంతం’తో గోపీచంద్ పట్టాలెక్కుతాడా ?

‘పంతం’తో గోపీచంద్ పట్టాలెక్కుతాడా ?

Published on Jun 6, 2018 12:40 AM IST

గత కొంత కాలంగా వరుస పరాజయాలతో సతమతవుతున్న హీరో గోపీచంద్ నటిస్తున్న తాజా చిత్రం’పంతం’. నూతన దర్శకుడు చక్రవర్తి తెరకెక్కిస్తున్నఈ సినిమా టీజర్ ఈరోజు విడుదలయ్యింది. టీజర్ చూస్తుంటే గోపిచంద్ ఈ సినిమాతో విజయం సాధించేలా కనబడుతున్నాడు.మంచి సోషల్ కాజ్ తో గోపించంద్ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్లుగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు . ఇక టీజర్ లో కోర్ట్ సీన్లో గోపిచంద్ పలికిన లెన్తీ డైలాగ్ ఈ చిత్రంఫై ఉన్నఅంచనాలను పెంచుతున్నాయి.తన సినిమా టైటిల్ విషయంలో రెండు అక్షరాలా సెంటిమెంట్ ను ఈసినిమాతోనూ కంటిన్యూ చేస్తున్న గోపీ ఈసారైనా సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడో లేదో చూడాలి. పైగా ఇది ఆయనకి 25వ సినిమా.

సత్యసాయి ఆర్ట్స్ పతాకంఫై కే కే రాధామోహన్ నిర్మిస్తున్న ఈసినిమాలో మెహరీన్ కథానాయికగా నటిస్తుంది . గోపి సుందర్ సంగీతం అందిస్తున్నఈ చిత్రం జులై 5న ప్రేక్షకుల ముందుకురానుంది.

టీజర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

తాజా వార్తలు