గోపీచంద్‌కు హిట్ ఇవ్వడానికి ముందుకొస్తున్న దర్శకుడు

గోపీచంద్‌కు హిట్ ఇవ్వడానికి ముందుకొస్తున్న దర్శకుడు

Published on Nov 23, 2019 3:00 AM IST

Gopichand2

హీరో గోపీచంద్ కెరీర్ కొన్నాళ్ళుగా తీవ్ర ఒడిదుడుకుల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఎన్నో ఆశలతో చేసిన ‘చాణక్య’ కూడా నిరాశపరచడంతో అయోమయంలో పడిన ఆయన తన పాత దర్శకుడితో చేతులు కలిపే ప్రయత్నాలు చేస్తున్నారట. ఆ దర్శకుడు ఎవరో కాదు తేజ. తేజ చేసిన ‘జయం, నిజం’ చిత్రాలతో ప్రతినాయకుడిగా నిలదొక్కుకున్న గోపీచంద్ ఈసారి హీరోగా తేజ దర్శకత్వంలో సినిమా చేస్తారని బలమైన వార్తలు వినిపిస్తున్నాయి.

తేజ సైతం తనకిష్టమైన గోపీచంద్‌తో కలిసి వర్క్ చేయడానికి సుముఖంగానే ఉన్నారని, ఇప్పటికే వీరిద్దరి మధ్య చర్చలు జరిగాయని తెలుస్తోంది. అన్నీ కుదిరితే వచ్చే యేడాది వీరి ప్రాజెక్ట్ పట్టాలైక్కే అవకాశముంది. ఇకపోతే గోపిచంద్ త్వరలో సంపత్ నంది దర్శకత్వంలో కొత్త సినిమాను మొదలుపెట్టనున్నారు. ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నారు. ఇందులో తమన్నా కథానాయకిగా నటించనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు