గోపిచంద్ – తిరు మూవీ అప్డేట్ !

Published on Apr 18, 2019 1:00 pm IST

పంతం తరువాత హీరో గోపీచంద్ ప్రస్తుతం తమిళ డైరెక్టర్ తిరు తో ఓ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ చిత్రం యొక్క మొదటి షెడ్యూల్ లో యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నప్పుడు గాయపడ్డ గోపిచంద్ కోలుకొని మళ్ళీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ చిత్రం యొక్క కొత్త షెడ్యూల్ మే 15నుండి జరుగనుందని సమాచారం.

ఇక ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు అలాగే హీరోయిన్ విషయంలో కూడా క్లారిటీ రావాల్సివుంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకం ఫై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈచిత్రానికి పడి పడి లేచె మనసు ఫేమ్ విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ ఏడాది ద్వితీయార్థం లో ఈ చిత్రం ప్రేక్షకులముందుకు రానుంది.

సంబంధిత సమాచారం :