ఓటిటి లో మంచి రెస్పాన్స్ తో కొనసాగుతున్న గోపీచంద్ ‘భీమా’

ఓటిటి లో మంచి రెస్పాన్స్ తో కొనసాగుతున్న గోపీచంద్ ‘భీమా’

Published on Apr 27, 2024 2:00 AM IST

యాక్షన్ హీరో గోపీచంద్ లేటెస్ట్ మూవీ భీమా ఇటీవల థియేటర్స్ లో రిలీజ్ అయి యావరేజ్ విజయం అందుకుంది. గోపీచంద్ డ్యూయల్ రోల్ చేసిన ఈ మూవీలో ప్రియా భవాని శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్ గా నటించగా కన్నడ యువ దర్శకుడు ఏ హర్ష తెరకెక్కించారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ తాజాగా ప్రముఖ ఓటిటి మాధ్యమం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ద్వారా రిలీజ్ అయి ప్రస్తుతం మంచి రెస్పాన్స్ తో కొనసాగుతోంది.

తాజా అప్ డేట్ ప్రకారం భీమా మూవీ హాట్ స్టార్ లో టాప్ లో ట్రెండ్ అవుతూ కొనసాగుతోంది. ఇక రాబోయే రోజుల్లో కూడా మూవీ మరింత మంచి రెస్పాన్స్ అందుకునే అవకాశం కనపడుతోంది. రవి బస్రూర్ సంగీతం అందించిన ఈమూవీని శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై కేకే రాధామోహన్ గ్రాండ్ గా నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు