టీవీ ప్రీమియర్ కి సిద్ధమైన గోపీచంద్ “భీమా”

టీవీ ప్రీమియర్ కి సిద్ధమైన గోపీచంద్ “భీమా”

Published on May 21, 2024 9:00 AM IST

టాలీవుడ్ హీరో గోపీచంద్ ప్రధాన పాత్రలో, ఏ. హర్ష దర్శకత్వం లో తెరకెక్కిన ఫాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్ భీమా. ఈ చిత్రం మార్చి 8, 2024 వ తేదీన వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ గా కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయిపోయింది.

ప్రముఖ టీవీ ఛానల్ అయిన స్టార్ మా ఈ చిత్రం యొక్క శాటిలైట్ హక్కులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఆదివారం స్టార్ మా ఛానెల్ లో మధ్యాహ్నం 1:00 గంటలకు భీమా చిత్రం ప్రసారం కానుంది. ఈ చిత్రం లో ప్రియా భవాని శంకర్, మాళవిక శర్మ లేడీ లీడ్ రోల్స్ లో నటించగా, నాజర్, నరేష్, పూర్ణ, వెన్నెల కిషోర్, రఘుబాబు, ముఖేష్ తివారీ, చమ్మక్ చంద్ర తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు